మూసా అలీఖాన్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
మిర్యాలగూడ : 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని రెయిన్‌బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ప్రతిభా పురస్కార అవార్డుల సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ కూకట్ పల్లి లో జరిగిన కార్య క్రమంలో మిర్యాలగూడ వాసి, నటుడు, నిర్మాత మూసా అలీఖాన్ గౌరవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సేవలో, కళా రంగంలో నిష్ణాతులై ప్రతిభ చూపించిన వారికి ప్రముఖ దర్శక, నిర్మాత, రెయిన్‌బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ సెక్రటరీ మోహన్ తో కలసి అవార్డులు ప్రదానం చేశారు . డాక్టర్ సుధారాణి తో పాటు సినిమా నటులు, రాజకీయ నాయకులు, కళాకారులు, సామాజిక సేవకులు పాల్గొన్నారు. మూసా అలీఖాన్ మాట్లాడుతూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, పేద విద్యార్థులను , కళాకారులను ఆదుకుని వారి ఉన్నతికి పాటు పడాలని పిలుపు నిచ్చారు. త్వరలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని పేద కళాకారులకు తన వంతు సహాయం చేస్తానని మూసా అలీఖాన్ తెలిపారు. అనంతరం మూసా అలీఖాన్ ను నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించి గౌరవించారు.