మునుగోడు ప్రజాదీవెన సభలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం, ముఖ్యాంశాలు :
ప్రజాలహరి..
• ప్రజాదీవెన సభను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ నా నమస్కారమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.
ఒకనాడు మునుగోడు ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో బాధలు పడ్డదనీ,అన్షుల స్వామి అనే ఫ్లోరైడ్ బాధితుడిని దుషర్ల సత్యనారాయణ జల సాధన సమితి నేత, ఢిల్లీలో ప్రధానమంత్రి ముందుకు తీసుకెళ్లడం జరిగిందనీ మా బతుకు ఇదీ అని చెప్తే.. ఎవరూ పట్టించుకోలేదనీ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ నగారా పేరుతో నేను కూడాజిల్లామొత్తంతిరిగిన
ఫ్లోరైడ్ బాధలపైప్రజలను చైతన్య పరిచినమని చెప్పారు.
నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్నితరిమికొట్టకపోతే.. నో మ్యాన్ జోన్ అవుతది.. అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.
ఆనాడు రాష్ట్ర పాలకులుగానీ, దేశ పాలకులు గానీ పట్టించుకోలేదనీ వివరించారు.
కానీ, స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంతో వందశాతం ఇండ్లకూ నీళ్లిస్తున్నమని తెలిపారు.
నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు
ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు.. అధికారం వేరే వాళ్లకిచ్చి ఇతరులను పోరాటం చేయమంటే ఎట్లా
మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలె. తెలివితో మన ఓటు మనకే వేసుకోవాలి అని అన్నారు.
ఈరోజు దేశంలో ప్రజా వ్యతిరేక, విద్వేష విధానాలపై మనం పోరాటం చేయాలి పిలుపునిచ్చారు
సమాజాన్ని విద్వేశంతో రెండుగా చీల్చే కుట్రలను అడ్డుకోవాలె. ప్రజలను కాపాడుకోవాలె
మునుగోడు ప్రజలకు ఎందుకొచ్చిందీ అనవసర ఉప ఎన్నిక బాధ.. మాయ మశ్చీంద్ర ఏమున్నది ఇందులో ప్రజల ఆలోచించాలి.
దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై, కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు
సీపీఐ పార్టీ కూడా వాళ్ల రాష్ట్ర కార్యదర్శి వర్గంలో చర్చింది, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. సీపీఐ పార్టీ వారికి మా ధన్యవాదాలునీ కెసిఆర్ తెలిపారు
సీపీఐ వారు కొన్ని సమస్యలను చెప్పారు. అవన్నీ తప్పక పరిష్కారమవుతయనీ
దేశంలో ఉన్న క్రియాశీల శక్తులన్నింటినీ సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ ఒక్కటి చేయాలనీ చెప్పారు
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై, నిర్లక్ష్యంపై ఎప్పటికప్పుడు కొట్లాడుతునే ఉన్నం.
• కొట్లాడుడు తెలంగాణకు కొత్త కాదు. కొట్లాడుడు మొదలుపెడితే ఎందాకైనా పోరాడుతం
• కృష్ణా నదిలో మా వాటా ఎంత అంటే? ప్రధాని సహా ఎవరూ సమాధానం చెప్పరు.
• మా కృష్ణా నీళ్లు మాకివ్వని అమిత్ షా.. నువ్వు ఇక్కడికెందుకొస్తున్నవు అని రేపు మీరంతా ప్రశ్నించాలె.
• మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్రమంత్రో, ఇక్కడి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డో ఢిల్లీకి పోయి మా శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లివ్వమని అడగాలనీ
కేంద్రం విధానాలేమిటో రేపు కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేశారు
వ్యవసాయ బావులకు మోటర్లకు మీటర్లు పెట్టుమని కేంద్రం చెప్తే.. నేను సచ్చినా మీటర్లు పెట్ట అన్న
ఎరువుల ధరలు పెంచిండ్రు. వరి ధాన్యం కొనమంటే కొనరు
వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీ వాళ్లకు అప్పజెప్పి, రైతులను కూలీలను చేసేందుకే కేంద్రం కుట్ర చేస్తున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు
మునుగోడులో 1 లక్ష మందికి రైతు బంధు డబ్బులు.. నేరుగా మీ ఖాతాల్లేనే వేస్తున్నం
మేం హైదరాబాదు బ్యాంకుల జమ చేస్తే.. మీ ఖాతాల్లో డబ్బులు పడగానే, మీ సెల్లు ఫోన్లన్ల టింగు టింగు టింగుమని మెసేజులు మోగుతయని
ఆసరా పెన్షన్లు కూడా ఇవ్వొద్దంటది కేంద్రం. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు బంద్ చెయ్యమంటరు.అని కెసీఆర్ చెప్పారు
ఇవాళ రైతు ఏ కారణం చేత చనిపోయినా, 10 రోజుల్లోపల ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా డబ్బులు అందిస్తున్నం. దేశంలోనే ఎక్కడా లేదు.
మునుగోడులో జరిగేది మన బతుకుదెరువు ఎన్నిక.
ఈ విషయాలన్నింటినీ గ్రామాల్లోకి పోయినంక అందరూ కలిసి చర్చించుకోవాలనీ
పంద్రాగస్టునాడు ప్రధాని మాట్లాడితే.. మైకులు పగిలిపోతయి. కానీ, చేసింది ఏమీ లేదు
ప్రజా బలం తోనే నేను ప్రధాన మంత్రితో కొట్లాడుతున్న… మీరే నా బలం, మీరే నా ధైర్యం అని తెలిపారు
మునుగోడు చరిత్రలో ఎన్నడు కూడా బీజేపీకి డిపాజిట్ రాలే
మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయి మీటరు పడ్డట్టే
• 103 టీఆర్ఎస్, 3 తోకలున్నోడు 110 తోకలను పడగొట్టి, ఏక్ నాథ్ షిండేలను తెస్తడటనీ చెప్పారు
ఏందీ అహంకారం, మీ అధికారమా? ఏం చేస్తరు మీరు? ఈడీ బోడీలకు ఎవరూ భయపడరు.
నువ్వు గోకినా, గోకకున్నా..నేను నిన్ను గోకుత మోడీ అని చెప్పినాను
తమిళనాడులో, బెంగాల్లో ప్రభుత్వాలను పడగొడుతమని చెప్తరు.
• మోడీ అహంకారం, గర్వం, ఆయన రైతు, ప్రజా వ్యతిరేక విధానాలే మోడీ నీ పడగొడ్తయి.
• గ్రామం సల్లగుంటె, రైతు దగ్గర పైసలుంటే, తెలంగాణ బాగు పడుతదన్నదే నా మాట
తెలంగాణ అభివృద్ధి చెంది, తెలివి వస్తుంటే.. కేంద్రానికి కండ్లు మండుతున్నయా?
దేశంలో మీరు చేసిన గొప్ప పనులేమిటో చెప్పండి. నీళ్లు రావు, కరంటు రాదని ఆయన చెప్పారు
దేశంలో 24 గంటలు అన్ని రంగాలకు నాణ్యమైన కరంటు ఇస్తున్నది తెలంగాణ ఒక్కటేబీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో గానీ, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో గానీ ఇస్తలేరుఈ డూప్లికేట్, అవసరంలేని ఉప ఉన్నికలు తెచ్చే గోల్ మాల్ కు బుద్ధి చెప్పాలని
మన బాయి మీటరు పెట్ట వద్దంటే.. మీరు బీజేపీకి మీటరు పెట్టాలె.
మీరు ఒక్కొక్కరు.. ఒక కేసీఆర్ కావాలె.. వుర్లల్ల చర్చించాలి. అందరికీ ఈ విషయాలు చెప్పాలె అని పేర్కొన్నారు
ఇది పార్టీల ఎన్నిక కాదు. రైతుల, కూలీల బతుకు ఎన్నిక. తెలంగాణ బతుకుదెరువు ఎన్నిక
దేశంలో కులపిచ్చి, మత పిచ్చి మంచిది కాదు.. దాన్ని తిప్పికొట్టాలె అని పేర్కొన్నారు
రూపాయి విలువ ఏ ప్రధాని హయాంలోనూ ఇంతగా పడిపోలేదు
నిరుద్యోగం పెరిగింది. ఉన్న సంస్థల్ని అమ్ముతున్నరు.కార్మికులు రోడ్డున పడుతున్నరు
రైతులను బతకనిస్తలేరు. పండిన పంటల్ని కొంటలేరు. ఏందని అడిగితే ఏం చెప్పరు.
ఈరోజు తెలంగాణ మంచిగ అభివృద్ధి చెందింది. కానీ, వాళ్లు ఓర్వలేకపోతున్నరు.
కేసీఆర్ బతికున్నంత వరకు ఎట్టిపరిస్థితుల్లో కరంటు మీటర్లు పెట్టను. రైతుబంధు, రైతు బీమా ఆగదు. ని చెప్పారు
వ్యవసాయం బాగుంటెనే అందరు బాగుంటరు. అది గుర్తుంచుకోండి
గుజరాత్ లో 600 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తరు
మనం 2 వేలు ఇస్తున్నం. మీరు ఎవర్ని గెలిపిస్తరో చెప్పండి.
బీజేపీని గెలిపిస్తే.. అన్ని సంక్షేమ పథకాలు బంద్ అవుతయి నీ పేర్కొన్నారు
నేడు సీపీఐ కలిసి వచ్చింది. రేపు సీపీఎం కూడా కలిసి వస్తది.
• ఉప ఎన్నికల్లో దెబ్బ కొడితే.. దిమ్మ తిరగాలె.. నషాళానికి అంటాలె బీజేపీ కింద పడిపోవాలె.
కాంగ్రెస్ కు ఓటేస్తే.. మన ఓటు ను వృధా చేసుకున్నట్టే.. ఆ పార్టీ గెలిచేది లేదు. వచ్చేది లేదు.. అని గుర్తు పెట్టుకోవాలె.
దేశంలో కాంగ్రెస్ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు. వీళ్లు చేసేది కూడా ఏం లేదు.
ఆడబిడ్డలు, అక్కా చెళ్లెళ్లు, తల్లులు ఇంటికి పోయినంక నేను చెప్పినవి చర్చ చెయ్యాలె.
కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల మీద, పిల్లలు తాగే పాలమీద, చివరకు స్మశానం మీద కూడా జీఎస్టీ విధిస్తున్నది. ప్రజలను పీడిస్తున్నది.
మునుగోడు రైతులు వ్యవసాయ బోర్ల కాడ దండం పెట్టి పోయి ఓట్లేయాలె అని చెప్పారు
మహిళలు గ్యాస్ సిలిండర్ల కు దండం పెట్టి పెరిగిన గ్యాస్ ధరలను తల్సుకొని వెళ్లి ఓట్లేయాలె. కరంటు కడుపునిండా రావాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకోవాలె. ఆని
టీఆర్ఎస్ పార్టీ వాళ్లతోపాటు, ప్రగతిశీల శక్తులు ఏకం కావాలె.. బీజేపీని ఓడించాలె.
• మునుగోడులో గిరిజన సోదరులున్నరు. టీఆర్ఎస్ గవర్నమెంటే 3500 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది.
ఏమరుపాటుగా ఓటేస్తే మన బతుకులు ఆగమైతయి. మన ఓటు మనకే వేసుకోవాలె.
• అందుకే తెలంగాణను అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాలె.
ఈ ఎన్నికల్లో క్రియాశీల, ప్రగతిశీల శక్తుల బలం ఏమిటో దేశానికి చాటి చెప్పాలె నీ చెప్పారు
.
• మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సభా వేదిక వద్దకు 3.45 గంటలకు చేరుకున్నారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ అమరులకు నివాళులర్పించారు.
ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం వేదికపై ఆశీనులైన టీఆర్ఎస్ నాయకులు, మద్దతు తెలిపిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి తదితరులను ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా పలకరించారు.