Ultimate magazine theme for WordPress.

కృష్ణాష్టమివేడుకల్లో పాల్గొన్న సిద్ధార్థ

Post top

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న సిద్దార్ధ

 

ప్రజాలహరి…

మిర్యాలగూడ పట్టణంలో నాగార్జున నగర్ కాలనీలో స్థానిక యాదవ సంఘ భవనం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు సిద్దార్ధకు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ విశేష కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పండుగలన్నింటినీ ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఉమ్మడి పాలకులు తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పలు పండుగల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని మతాల పండుగలను ఐకమత్యంతో తెలంగాణ రాష్ట్ర సౌభ్రాతృత్వాన్ని, ఏకత్వాన్ని చాటే విధంగా జరుపుకుంటున్నామని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. అనంతరం కృష్ణాష్టమి సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన కోలాటం, నృత్య ప్రదర్శనలను, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నల్లమోతు సిద్దార్ధ తిలకించారు. కళాకారులను అభినందించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.