Ultimate magazine theme for WordPress.

ఫోటోగ్రాఫర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పంపిణీ చేసిన.. నీలం మధు

Post top

ఫోటోగ్రాఫర్లకు కుటుంబాలకు ఆరోగ్య కార్డులు అందించిన తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్… ప్రజాలహరి… దైనందిక జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఆరోగ్యమైన సందర్భంలో ఆదుకునే వారు లేక అవస్థలు పడుతున్న వారిని ఆదుకోవాల్సిన లక్ష్యం మన అందరిపై ఉందని చిట్కూల్ సర్పంచ్ టిఆర్ఎస్ నాయకుడు నీలo మధు ముదిరాజ్ అన్నారు. ఈరోజు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పంపిణీ చేశారు.కిందిస్థాయి నుంచి వచ్చానని కష్టం అంటే ఏవిధంగా ఉంటుందో నాకు తెలుసని అందుకే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని తెరాస రాష్ట్ర నాయకులు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో 73 మంది ఫోటోగ్రాఫర్లకు కుటుంబాలకు సొంత నిధులతో ఆరోగ్య కార్డులు చేయించి వాటి పత్రాలను ఫోటోగ్రాఫర్లకు చిట్కుల్ గ్రామంలో

అందజేశారు మున్సిపల్ ఐటీ శాఖ, మంత్రి కేటీఆర్ చేస్తున్న గిఫ్ట్ స్మైల్ లో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకొని తాను కూడా కార్యక్రమాలు చేయాలనే తలంపుతో సేవ చేస్తున్నానని తెలిపారు. తల్లిదండ్రులు చిన్ననాటి నుండి నన్ను ఎంతో కష్టపడి పెంచారని తాను కూడా ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చానని ఆయన ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు‌ నాలాగా మరొకరు కష్టపడకూడదు అనే తలంపుతో మీ మనిషిగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మీకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటానని తెలిపారు వేళా పాళా లేకుండా దైనొందిన జీవితంలో తిరిగే ఫోటోగ్రాఫర్లకు ఆరోగ్య కార్డులు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. దీంతో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండగలుగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు తాను కూడా ప్రభుత్వానికి సహాయంగా ఇలాంటి కార్యక్రమాలు అదనంగా చేస్తున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ నారాయణరెడ్డి,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, బుజాంగమ్,మురళీ, వెంకటేశ్ రాజ్ కుమార్,ఆంజనేయులు,పటాన్చెరువు నియోజకవర్గం ఫోటోగ్రఫీ అధ్యక్షులు కృష్ణ యాదవ్, ఇస్నాపూర్ ఫోటోగ్రఫీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సభ్యులు సుధాకర్,రవీందర్,నరేందర్,నాగేష్,అనిల్, శోభన్,సతీష్, జ్ఞానేశ్వర్,నరేష్,హరికృష్ణ, గుమ్మడిదల బొంతపల్లి జిన్నారం ఫోటో వీడియో గ్రాఫర్ సభ్యులు,NMR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.