Ultimate magazine theme for WordPress.

వజ్రోత్సవ ఫ్రీడమ్ కప్పు పోటీలు ముగింపు

Post top

పటాన్చెరులో ఘనంగా ముగిసిన వజ్రోత్సవ ఫ్రీడమ్ కప్ క్రీడలు

 

విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

 

పటాన్చెరు

 

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ద్వి సప్తహ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ కప్ పోటీలు పటాన్చెరులో ఘనంగా ముగిశాయి.

 

పటాన్చెరు పట్టణం లోని సెంట్ జోసెఫ్ హైస్కూల్లో గురువారం నిర్వహించిన మండల స్థాయి ఫ్రీడమ్ కప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరాయి పాలన నుండి భారతావనికి విముక్తి కల్పించేందుకు ఆనాడు సాగిన స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను, మహనీయుల త్యాగాలను నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో ద్వి సప్తహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశభక్తిని చాటుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.