క్రీడలతో జాతీయ స్ఫూర్తిని చాటాలి
-వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలు భాగస్వాములు కావాలి
-తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వజ్రోత్సవాల నిర్వహణ
-క్రీడా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
-దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
క్రీడలతో జాతీయ స్ఫూర్తిని చాటాలని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పోలీస్ గ్రౌండ్ లో 75వ స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జాతీయ స్ఫూర్తిని పెంచడానికి క్రీడలు ప్రతీక అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది రోజులుగా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తు దన్నారు.దేవరకొండ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం షెడ్యూల్ వారీగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు క్రీడల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు మెలగాలి అన్నారు. ఫ్రీడమ్ కప్పును గెలుచుకొని క్రీడాస్ఫూర్తిని చాటలి అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్,జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శ్రీనివాసులు, రవీందర్,పరిశారాం,ఎస్సైలు,అధికారులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.