Ultimate magazine theme for WordPress.

అడ్వకేట్ హత్య కేసులో నిందితులు రిమాండ్

Post top

*అడ్వకేట్ హత్య కేసులో నిందితుల అరెస్ట్*

-జిల్లా యస్ పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్

ప్రజాలహరి…

తేదీ 13.08.2022 సాయంత్రం సుమారు 4.30 గం.లకు యల్లమ్మగూడెం గ్రామంనికి చెందిన గాదె విజయ్ రెడ్డి ని హత్య చేశారు అని మృతుని బార్య గాదె సంధ్యా తన భర్త వ్యవసాయ పనులకు ఎల్లమ్మగూడెం గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు ముగించుకుని నల్గొండకు వస్తుండగా మూసీ కాలువ సమీపంలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హత్య చేశారని, అనుమానిత పేర్లు సందీప్ రెడ్డి S/o సత్తిరెడ్డి మరియు మరి కొందరు చేసి ఉంటారని తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా (Cr. నం. 122/2022 U/Sec. 120(B), 302 r/w 34 IPC) కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితులను ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారించగా వారు చెప్పిన వివరాల మేరకు 2006లో మృతుడు వూట్కూరి సందీప్ రెడ్డి, వూట్కూరి ప్రవీణ్ రెడ్డిల తండ్రులతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేయడంతో వారు జైలుకు వెళ్లారు. తరువాత 2016 లో 200 గజాల స్థల విషయంలో వూట్కూరి సందీప్ రెడ్డిపై నల్గొండ II టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని, తరువాత 2019లో మృతుడి భార్య ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుండి మృతుడు గ్రామంలో కొంత ఆధిపత్యం చెలాయించేవాడని, నిందితుల వారి కుటుంబ సభ్యులపై పలు కేసులు పెట్టి వేధిస్తుoడడం తో దీంతో సందీప్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై విజయ్‌రెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు, నెల క్రితం, సందీప్ రెడ్డి మరియు ప్రవీణ్ రెడ్డి అతనిని హత్య చేయాలని ప్లాన్ వేసి 02 గొడ్డళ్లను కొనుగోలు చేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, హత్యకు ముందు రెండుసార్లు ప్రయత్నించినా విఫలమయ్యారు. తరువాత మృతుడి కదలికల గురించి సమాచారం ఇచ్చేందుకు విజయ్ రెడ్డి పక్కనే భూమి ఉన్న మన్యం ఉపేందర్ రెడ్డి సహాయం తీసుకునీ, తేదీ 13.08.2022న గాదె విజయ్ రెడ్డి తన వ్యవసాయ పొలాల వద్దకు రాగా, ఏ-3 ఉపేందర్ రెడ్డి విజయ్ రెడ్డి గురించి సందీప్ రెడ్డికి ప్రవీణ్‌రెడ్డికి ఫోన్‌ చేయగా, వీరు టీఎస్‌ 03 యూఏ 7535 నంబర్‌ గల బొలెరో వాహనంలో ఎల్లమ్మగూడెం వచ్చి విజయరెడ్డి మోటారు వాహనాన్ని ఢీకొట్టారు. విజయ రెడ్డి కిందపడగానే సందీప్ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి మెడపై, ఇతర శరీర భాగాలపై గొడ్డళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను ఈ రోజు పట్టుకొని బోలోరో వాహనం,రెండు గొడ్డళ్లు,మూడు ఫోన్లు స్వాధీన పరచుకుని రిమాండ్ కి పంపనైంది.

 

*గతంలో నిందితుల పైన నమోదయిన కేసుల వివరాలు* :

1 Cr No. 14/2015 U/Sec 120(B), 114, 115 IPC సెక్షన్ 25(1-b), 25 (1)(A)(B) ARMS చట్టం మిర్యాల్‌గూడ I టౌన్ PS

2 Cr No.56/2016 U/Sec 324, 448, 506 r/w 34 IPC తిప్పర్తి PS

3 Cr.No.244/2016 U/Sec 447, 427, 506 IPC నల్గొండ II టౌన్ PS

4 Cr.No 95/2018 U/Sec 324, 504, 506 IPC తిప్పర్తి PS

5 Cr No.51/2020 U/sec 341, 323, 504, 506 r/w 34 IPC నాంపల్లి PS

6 Cr No.53/2022 U/Sec 342, 504, 506 IPC తిప్పర్తి PS

7 Cr No.355/2020 U/sec 498(a) IPC సెక్షన్ 3 & 4 ఆఫ్ DP చట్టం సూర్యాపేట టౌన్ PS

 

 

1 Cr.No.114/2020 U/Sec 326, 323, 504, 506 r/w 34 IPC తిప్పర్తి PS

 

నిందితుల వివరాలు.

A-1) వుట్కూరి సందీప్ రెడ్డి S/o సత్తిరెడ్డి, వయస్సు: 37 , కులం: రెడ్డి, Occ: వ్యాపారం, r/o ఎల్లమగూడెం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా.

A-2) వూట్కూరి ప్రవీణ్ రెడ్డి S/o సత్తిరెడ్డి, వయస్సు: 36, కులం: రెడ్డి, Occ: వ్యాపారం, r/o ఎల్లమగూడెం, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా.

A-3) మన్నెం ఉపేందర్ రెడ్డి S/o పుల్లా రెడ్డి, వయస్సు: 47 సంవత్సరాలు, కులం: రెడ్డి, Occ: వ్యవసాయం, r/o చెర్కుపల్లి గ్రామం, కేతేపల్లి మండలం, నల్గొండ జిల్లా.

post bottom

Leave A Reply

Your email address will not be published.