Ultimate magazine theme for WordPress.

మునుగోడు సభతోని భాజపాకు చరమగీతం.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Post top

నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా … మంత్రి జగదీశ్వర్ రెడ్డి..

ప్రజాలహరి..

ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్. టి ఆర్ యస్ కు సొంతమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు గురువారం ముఖ్యమంత్రి సభాస్థలి ప్రజా దీవెన కార్యక్రమాన్ని ఏర్పాటనుపరిశీలించారు,

 

మునుగోడు లో ఎగిరేది గులాబీ జెండానే నీ

ఇక్కడ బిజెపి మూడో స్థానానికే పరిమితము అవుతుందని చెప్పారు.

టి ఆర్ యస్ కు కాంగ్రెస్ పార్టీనే మధ్యనే పోటీ,

మాకు కాంరెస్ కు మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుందనీ పేర్కొన్నారు

ఫ్లోరోసిస్ ను నిర్ములించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని మునుగోడు సభ నుండి మోడీ పాలనకు చరమ గీతం ప్రారంభమైతుందని ప్రారంభం అవుతుంది మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు

చురుకుగా సాగుతున్న

మునుగొడులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాదివేన ఏర్పాట్లు

 

గురువారం రోజున సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి ఆయన వెంట టి యస్ ఐ ఐ సి బాలమల్లు,తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా గా మరిపోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టి ఆర్ యస్ పార్టీ హ్యాట్రిక్ సాధించ బోతుందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు లో ఎగిరేది గులాబీ జెండాయె నని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 20 న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో టి ఆర్ యస్ పార్టీ జరుప తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాదీవేనా సభాస్థలిని గురువారం రోజు మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షించారు. టి యస్ ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు,తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్,నియోజకవర్గ టి ఆర్ యస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బిజెపి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నారు.ఇక్కడ మాతో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీయే అని,అయితే ఓట్ల పరంగా టి ఆర్ యస్ కు కాంగ్రెస్ పర్తికి భారీ వ్యత్యాసం ఉంటుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ ను నిర్ములించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. మునుగోడు లో నిర్వహించ తలపెట్టిన ప్రజాదివేన సభనుండి మోడీ పాలనపై యుద్ధం ప్రకటించ బోతున్నట్లు ఆయన వెల్లడించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.