Ultimate magazine theme for WordPress.

బాజపా ఆటలు సాగనివ్వం. జూలకంటి

Post top

బీజేపీ ఆటలు జిల్లాలో సాగనివ్వము..

*స్వార్థం కోసమే రాజగోపాల్ పార్టీ ఫిర్యాయింపు

*ఉప ఎన్నికల్లో కమ్మునిస్టుల సత్తా చాటుతాము

 

ప్రజాలహరి….

 

ఓటు బ్యాంకు లేని బిజెపి దక్షిణ తెలంగాణ జిల్లాలో పట్టు సాధించేందుకు బడా రాజకీయ నాయకులను పార్టీలో చేసుకుంటున్నారని బిజెపి ఆటలు జిల్లాలో సాగనివబోమని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ జిల్లాలలో బిజెపి పాగ వేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. జిల్లాలో బిజెపి ఆటలు సాగనివ్వమని చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టుల సత్తా చాటుతామని తెలిపారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉందని చెప్పారు. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉన్నామని చెప్పారు. బిజెపినీ ఓడించేందుకు కురిచేస్తామన్నారు. ఇప్పటికే సిపిఎం సిపిఐ పార్టీలు కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించామని త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాల అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మునుగోడు లో బిజెపికి సొంత బలం లేకపోయినప్పటికీ రాజగోపాల్ రెడ్డికి కాంటాక్ట్ ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని… రాజగోపాల్ రెడ్డి కూడా తన స్వార్ధ ప్రయోజనాల కోసం బిజెపిలో చేరుతున్నాడని విమర్శించాడు. అభివృద్ధి కోసం అయితే అభివృద్ధి చేసే పార్టీలో చేరాలని, కానీ రాజగోపాల్ రెడ్డి పేద ప్రజలపై అన్ని రకాల బారాలు మోపుతూ బతుకు భారం చేస్తున్న బిజెపి పంతాన చేరడం సరేంది కాదన్నారు. ప్రజాదానాన్ని దోచుకు తింటున్న బిజెపి జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిందో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉప ఎన్నిక వల్ల ప్రజాధనం వృధాగా ఖర్చు అవుతుందని వాపోయారు. మునుగోడు పోరాటాల గడ్డ అని బిజెపి ఎత్తుగడలను సాగనివ్వబోమని, దానిని కట్టడి చేసేందుకు కమ్యూనిస్టులుగా తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, భావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, గుణ గంటి రామచంద్రు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.