
ప్రజాలహరి ….
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఉచితాలంటూ కేంద్రం విమర్శించడం సరైంది కాదన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.