కులాలు, మతాల పేరుతో విడదీయడానికి కొందరు వస్తున్నారు వారిని తరిమి కొట్టండి ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రజాలహరి.. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని విచిన్న కర శక్తులు ప్రవేశిస్తున్నాయని వాటిని తరిమికొట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు .కులాలు మతాలు పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజల్ని ఏమారుస్తున్న పార్టీలను ఎండగట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల కోసం పని చేయాలన్నారు. ఎమ్మెల్యేలకు సంవత్సరానికి అయిదు కోట్లు నిదులు ఈస్తున్నామని మేడ్చల్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మరో 10 కోట్లు చొప్పున ఒక్కో ఎమ్మెల్యేకి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మేడ్చల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకు ఎమ్మెల్యేకు సూచన చేశారు. నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రo తెలంగాణ అన్ని అన్నారు. అన్ని రకాలుగా తొక్కి వేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వారి మాటలు నమ్మవద్దని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్న శక్తులను వెంటబడి తరిమికొట్టాలన్నారు. వైజ్ఞానికంగా సాంకేతికంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాల పాలనలో తెలంగాణ కు గాని తెలంగాణ ప్రజలకు ఇసుమంత నష్టం జరగలేదని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని వాటీనీ నమ్మవద్దని అని చెప్పారు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.