Ultimate magazine theme for WordPress.

తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోకాలు అడ్డుతున్న కేంద్రం కేసిఆర్

Post top

ఉచిత పథకాలు అంటూ నిధులు ఇవ్వకుండా మోకాలు అడ్డుతున్న కేంద్రం ..ముఖ్యమంత్రి కేసీఆర్..

ప్రజాలహరి… తెలంగాణ ప్రభుత్వం పై కేంద్రం కక్ష పూర్తి చర్యలు ఏర్పడుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విమర్శించారు. ఈరోజు వికారాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత సంక్షేమ పథకాలు అంటూ తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని విమర్శించారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని , విదేశీ బొగ్గుని కొనుగోలు చేయాలని మన రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. వారి అనుచరులకు కేంద్రం నిధులను దోచిపెడుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రo ఏర్పడినాక అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి వెళ్లిందని ఇది చూసి ఓర్వలేక కొందరు ప్రభుత్వంపై అవాకులు, చాకులు పేలుతున్నారని చెప్పారు. నిజంగా వారికి తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయించాలని సవాల్ విసిరారు. వికారాబాద్ కు కృష్ణానది నుంచి నీటిని తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నామని అవి త్వరలోనే వస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వికారాబాద్ కు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన విధంగానే డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు .ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనందు ,పట్ట మహేందర్ రెడ్డి లు పాల్గొన్నారు

.

post bottom

Leave A Reply

Your email address will not be published.