Ultimate magazine theme for WordPress.

జర్నలిస్టు ల సహకారం అవసరం

Post top
home side top

అన్ని వర్గాల భాగస్వామ్యంతో మిర్యాలగూడ జిల్లా సాధించుకుందాం:- జర్నలిస్టుల సూచన

ప్రజాలహరి  ….   సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉధృతం చేసి మిర్యాలగూడ జిల్లాను సాధించుకుందామని సీనియర్ జర్నలిస్టులు ఖాజా హమీదోద్దీన్, కలిమెల నాగయ్య, ఆయుబ్ లు సూచించారు. మంగళవారం ఉదయం మిర్యాలగూడలోని ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు జర్నలిస్టుల మధ్య జరిగిన చర్చాగోష్టిలో పలువురు జర్నలిస్టులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ఆకాంక్ష అందరిలో ఉందని అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధికార TRS పార్టీతో సహా సిపిఎం, సిపిఐ,టిడిపి,కాంగ్రెస్,YSRTP, MIM, AAP పార్టీలను ఉద్యమంలో భాగస్వాములు చేయాలన్నారు. మిర్యాలగూడ,నాగార్జునసాగర్,హుజూర్ నగర్ నియోజకవర్గాలతోనే జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నదని అన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లాలని తద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి ఉద్యమం వైపు ప్రజలు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో ఒకేసారి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ప్రముఖమైందనీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ అన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని ఆయన కోరారు. ప్రముఖ వైద్యులు బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజు మాట్లాడుతూ ఉద్యమ తీవ్రత ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. ఉద్యమ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా జర్నలిస్టులు కృషిచేయాలని కోరారు. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు సహకరించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టుల మనోజ్, మంద సైదులు మాట్లాడుతూ విద్యార్థులతో కాకుండా రాజకీయ పక్షాలతో నే ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలతోనే జిల్లాను సాధించుకోవాలని సూచించారు. ప్రజాసంఘాలు ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా చేయాలన్నారు.MPTC లఫోరం బెజ్జం సాయి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు నరేందర్ రెడ్డి మట్టయ్య,రంగ శ్రీనివాస్,రమేష్ బాబు,నాగచారి, బంటు శ్రీనివాస్ నాగభూషణం, నాగేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రమేష్ నాయక్,వేణు, హరీష్, యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య చేగొండి మురళి యాదవ్, సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరాజు జయరాజు,రజక సంఘం అధ్యక్షులు దుర్గయ్య, సిపిఐ ఎంఎల్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.