స్వాతంత్ర సమరయోధులకు, మాజీ సైనికులకు ఘనంగా సన్మానం
* మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహణ
* కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ వెంకటేశ్వర రావు, యువనేత నల్లమోతు సిద్దార్ధ
ప్రజాలహరి..మిర్యాలగూడ…
స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులను, మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రావు, యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్
- నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల, మాజీ సైనికుల సేవలను కొనియాడారు. ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భారతావనిని విముక్తి కల్పించేందుకు స్వాతంత్ర్య సమరయోధులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారని, వారి సేవలు వెలకట్టలేనివని కీర్తించారు. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ శత్రు మూకల నుంచి, విదేశీయుల అక్రమ చొరబాట్ల నుంచి దేశ పౌరులను రక్షించడంలో సైనికులు నిర్వర్తిస్తున్న పాత్ర అనిర్వచనీయం, నిత్య స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తిరునగర్ నాగలక్ష్మీ భార్గవ్, మలగం రమేష్, అబ్దుల్ ఖాదర్, ఉదయ్ భాస్కర్, టూ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేష్, సలీమ్, తదితరులు పాల్గొన్నారు.