మానసిక,శారీరక వికాసానికి క్రీడలు దోహదం
* ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కప్-2022 నిర్వహణ
* విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీ ప్రదానం : నల్లమోతు సిద్దార్ధ
ప్రజాలహారి.. మిర్యాలగూడ..
మానసిక,శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు గ్రౌండ్ లో క్రికెట్ పోటీలను నిర్వహించారు. సోమవారం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుతో కలిసి యువనేత నల్లమోతు సిద్దార్ధ నగదు బహుమతి, ట్రోఫీ ప్రదానం చేశారు. మొదటి బహుమతి విజేత టీమ్ కు రూ.20 వేలు నగదు, ట్రోఫీ, ద్వితీయ బహుమతి విజేతకు రూ.10 వేలు నగదుతో పాటు ట్రోఫీ ప్రదానం చేశారు. అనంతరం నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. శరీర దృఢత్వానికి క్రీడలు పునాదిగా మారుతాయని అన్నారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఉత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ కొలువులను దక్కించుకుంటున్నారని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శించాలని కోరారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల అభిరుచిని గుర్తించి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని నల్లమోతు సిద్దార్ధ కోరారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు,నాయకులు, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.