Ultimate magazine theme for WordPress.

వీరారెడ్డి ఆశల కోసం పని చేద్దాం ..

Post top

వీరారెడ్డి ఆశయాలను సాధించాలి…

* వర్ధంతి సభలో డబ్బికార్

 

మిర్యాలగూడ… ప్రజాలహరి.. మిర్యాలగూడ..

రాగిరెడ్డి వీరారెడ్డి ఆశయాలను సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో రాగిరెడ్డి వీరారెడ్డి 41 వర్ధంతి సభ నిర్వహించారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం విరోచిత పోరాటాలు చేశారన్నారు. దున్నే వాడికి భూమి అనే నినాదాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లి రైతుల పక్షాన అనేక ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు. రైతులకు అండగా నిలుస్తున్న వీరారెడ్డి ఎదుగుదలను ఓర్వలేక రౌడీ మూకలు హత్య చేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకొని, ఆయన ఆశయాలను సాధించాలని, కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, పోలేబొయిన వర లక్మి, ఆయూబ్, తిరుపతి రామ్మూర్తి, రాగి రెడ్డి మంగా రెడ్డి, గాదె పద్మ, సత్యనారాయణ రావు,ఎండి అంజాద్ రాంచంద్రు, చెనగని యాదగిరి, గోవర్దని, ఊర్మిళ, అరుణ, కరిమున్నిసా,సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.