కేసీఆర్ పాలనలో ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
* రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాలులో పాల్గొన్న యువనేత నల్లమోతు సిద్దార్ధ
ప్రజాలహరి.. మిర్యాలగూడ..
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ- 6వ వార్డులో కొలువై ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో తన మాతృమూర్తి నల్లమోతు జయతో కలిసి బోనాలు పండుగలో సిద్దార్ధ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దార్ధ మాట్లాడారు. ధూప,దీప, నైవేద్యం విస్తరణ, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. నిత్య కైంకర్యాలకు 3,645 ఆలయాల్లో అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గౌరవ వేతనం, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను సర్కారు అందజేస్తోందన్నారు. కామన్ గుడ్ ఫండ్ నిధుల ద్వారా ఆలయాల జీర్ణోధారణ, నూతన ఆలయాల నిర్మాలకు నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టారని సిద్దార్ధ ప్రశంసించారు. సిద్దార్ధ వెంట సాధినేని శ్రీనివాస రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు