Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ జిల్లా కాకుండా కుట్ర చేశారు

Post top

రాజకీయ పక్షపాతంతో మిర్యాలగూడను జిల్లా కాకుండా చేశారు:- నందకుమార్ నాయక్

జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలున్న రాజకీయ దురుద్దేశంతో మిర్యాలగూడజిల్లా కాకుండా అడ్డుకున్నారని నంగారా బేరి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తేజావత్ నందకుమార్ నాయక్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ కంటే వనరులు జనాభా ఆదాయం తక్కువ ప్రాంతాలను జిల్లాగా ఏర్పాటు చేసి మిర్యాలగూడకు అన్యాయం చేశారని అన్నారు. మిర్యాలగూడ జిల్లా కాకపోవడానికి కారణాలను రాజకీయపక్షాలు ప్రజలకు వివరించాలని లేనిపక్షంలో ప్రజల నుండి వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమానికి అన్ని రాజకీయ పక్షాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. నంగారా బేరి విద్యార్థి సంఘం జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతోపాటు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు వినోద్ కుమార్,రవి కుమార్,వినయ్, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, సిపిఐ ఎంఎల్ నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.