“ప్రజాలహరి వార్తకు స్పందన” విద్యానగర్లో డ్రైనేజీలపై స్లాబుల్ నిర్మాణం…………… ప్రజాలహరి… మిర్యాలగూడ… మిర్యాలగూడ పట్టణంలోనీ విద్యానగర్లో డ్రైనేజీలు ధ్వంసం వార్తకు మున్సిపల్ యంత్రాంగం స్పందించింది. విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ కల్వర్టు పై స్లాబ్ లు నిర్మించారు. విద్యానగర్లో డ్రైనేజీలు అద్వానంగా ఉండి ప్రజలు మరియు వాన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని శనివారము “ప్రజాలహరి న్యూస్ వెబ్ డిజిటల్ పత్రిక”లో ప్రచురించడం జరిగింది. దీనిపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ లు స్పందించారు. వెనువెంటనే విద్యానగర్ లో కాలువపై గల కల్వర్టుపై స్లాబు వేసి రాకపోకలు అతి తొందరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని క అధికారులను ఆదేశించారు. ,”ప్రజాలహరి “పత్రిక ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యలపై పోరాడుతూ వస్తున్నది. గతంలో మిర్యాలగూడ రహదారులు అద్వానంగా ఉన్నాయని వార్త ప్రచురించంది. అంతకు ముందుకు ప్రజల తాగునీటి దాహార్తిని తీర్చే మంచినీటి సరఫరా లో సమయపాలన పాటించటం లేదని ప్రజాలహరి న్యూస్ డిజిటల్ పత్రికలో ప్రచురించడం జరిగింది. నిరంతరం ప్రజల కోసమే పత్రికాపరంగా పనిచేయడం జరుగుతుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.