ఆజాద్ కి వజ్రోత్సవం వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి… ప్రజల హరి ..
ఆజాద్ కి వజ్రోత్సవం పిలుపులో భాగంగా దేశ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో నింపేందుకై ఖమ్మం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది సుమారు 750 మీటర్ల పొడవు గల జాతీయ జెండాను యాత్రగా ఖమ్మం లోని బీ లైఫ్ హాస్పిటల్ నుంచి పేవిలియన్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ఖమ్మం జిల్లాలో పరిధిలోని అంగన్వాడి టీచర్లు ,ఆయాలు ఉద్యోగులు ,విద్యార్థినిలు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా ఐసిడిఎస్ పిడి సంధ్యారాణి మాట్లాడుతూ నేటి తరం మహిళలు దేశ స్వతంత్ర ఉద్యమం గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. ఆనాడు మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి మనకు బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించారని ఆమె వివరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం సిడిపిఓ కవిత అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకురాలు నారపరాజు భార్గవి,సుధా, రమాదేవి , శ్రీలత, రేణుక.తదితరులు పాల్గొన్నారు