చరిత్రను రూపుమాపేందుకు పాలకులు కుట్రలు..
*ఆనాడు కాంగ్రెస్ అంటే సభ
*దేశ సమైక్యతను కాపాడేది వామపక్షాలే.
ప్రజాలహరి మిర్యాలగూడ.
చరిత్రను రూపుమాపేందుకు పాలకులు కుట్రల పన్నుతున్నారని ఆర్థిక విశ్లేషకులు అందే సత్యం ఆరోపించారు. శనివారం స్థానిక కరీం ఫంక్షన్ హాల్ లో 75 సంవత్సరాల భారత్ స్వాత్రంత్ర-రాజ్యాంగ పరిరక్షణ పై నిర్వహించిన సెమినార్ లో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. సుమారు 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్లకు మద్దతు పలికిన వారు ఇప్పుడు దేశభక్తి పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 1927 వచ్చిన అర్ఎస్ఎస్ బిటిష్ వారి అండగా నిలిచి ఆనాడు జరిగిన జాతీయ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేసారని ఎద్దవా చేశారు. ఆంగ్లేయులకు సహకరిస్తూ స్వాత్రంత్ర ఉద్యమాన్ని, జై హిందు, క్విట్ ఇండియా, 3 రంగులను వ్యతిరేకరించిన వారు గాంధీ ని చంపిన గాడ్సే ను పూజించారని విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు అజాదిక అమృత్ వజ్రోత్సవాలు పేరిట స్వాత్రంత్ర o కోసం పోరాడిన గాంధీ, నెహ్రు పేర్లను మర్చి పోయేందుకు ప్రయత్నస్తున్నారని చెప్పారు. జై హింద్, క్విట్ ఇండియా నినాదాలు ముస్లింలు తెచ్చారని, స్వాత్రంత్ర ఉద్యమంలో ముస్లిములు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసారని కొనియాడారు. హిందు, ముస్లింలు ఐక్యంగా ఉంది ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఆనాడు కాంగ్రెస్ అంటే పార్టీ కాదని, సభ అని చెప్పారు. మత విద్వేషాలు సృష్టించి దేశ విభజనకు ప్రోత్సహిస్తూ ప్రజల మద్య అసమానతలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశ సమైక్యత కోసం వామపక్షాలు నాటి నుంచి నేటి వరకు కృషి చేస్తున్నారని చెప్పారు. జాతీయ ఉద్యమం ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహనా కల్పించాలని కోరారు. దేశ సమైక్యతను సమానత్వంను కాపాడాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డా.మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్,భవాండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, పోలేబొయిన వర లక్స్మి, వేములపల్లి వైస్ ఎంపిపి పాదురి గోవర్ధనమ్మ, వినోద్ నాయక్,ఆయూబ్, పాదురి శశిధర్ రెడ్డి, యూటీఫ్ రాష్ట్ర నాయకులు నాగమణి,శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.