Ultimate magazine theme for WordPress.

విద్యానగర్ డ్రైనేజీ ధ్వంసం అయినా పట్టించుకోని అధికారులు

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ..   పట్టణంలో  రహదారులు డ్రైనేజీల నిర్మాణం , నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయింది .పట్టణంలో డ్రైనేజీలపై గల స్లాబులు దెబ్బతిని గుంతలు ఏర్పడిన అధికారులు చూసి చుడ న్నట్లు వ్యవహరిస్తున్నారు. విద్యానగర్లోని ప్రధాన కూడలిలో డ్రైనేజీ పై గల కల్వర్టు దెబ్బతిని గుంతలు మాయంగా ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు అవస్థలు పడుతున్న పట్టించుకోవడం లేదు. గత రెండు నెలలుగా డ్రైనేజీ పై  స్లాబు నిర్మాణం జరగలేదు. సుమారు నెల 15 రోజులుగా ఈ ప్రాంతంలో వెళ్లే వాహన చోధకులు చుట్టూ తిరిగి వెళుతున్నారు. సబ్ జైలు వెళ్లే మార్గంలో  కలవర్టు స్లాబ్ వేయడానికి మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి పెట్టి ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు. విద్యానగర్ లో గల డ్రైనేజీ పై గల స్లాబ్ ఏర్పాటు చేయకపోవడం వలన  ప్రజలు ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవటం లేదు .ఈ ప్రాంతం గుండా ఇందిరమ్మ కాలనీ ,అద్దంకి బైపాస్ కి వెళ్లి మార్గం కావడం చే అధిక రద్దీగా ఉంటుంది .అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.