ప్రజాలహరి. మిర్యాలగూడ.. జాతీయ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా యువత ఉండాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అన్నారు. నేటి యువతరం జాతీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని యువత సక్రమమార్గమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నత స్థితి ఎదగాలని కోరారు. భారత స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలే నేటికీ మన స్వేచ్ఛను కాపాడుతున్నాయని విషయాన్ని గుర్తు చేశారు .మిర్యాలగూడ రాజకీయ ముఖ చిత్రంలో ఇంతవరకు కనివిని వేరుగని రీతిలో జాతీయ భావం వెలువల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఆయన ఆధ్వర్యంలో సుమారు 2500 అడుగుల జాతీయ జెండాను ప్రత్యేకంగా తయారు చేయించారు. మున్సిపల్ కౌన్సిల్ మరియు పట్టణ ప్రముఖ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆయన చేసిన ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేటట్టుగా వేలాదిమంది సమక్షంలో నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులు యువకులు ఉత్సాహంగా రహదారుల పైకి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు 2500 అడుగుల జాతీయ జెండాను ఇరువైపులా ప్రజలు యువకులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు కన్నుల పండగ జరిగింది పలువురు నాయకులు తిరునగర్ భార్గవ్ ను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు ఎన్విఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు