సీసీ కెమెరాలు నిఘా నేత్రాలు : డీఎస్పీ వెంకటేశ్వర రావు
ప్రజాలహరి.. మిర్యాలగూడ..
నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేస్తాయని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఆజాదికా అమృత్ మహోత్సవాలలో భాగంగా మిర్యాలగూడ మండలంలో శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతి భవనం నుంచి 1 కిలో మీటర్ దూరం వరకు జాతీయ జెండాలతో తీసిన ర్యాలీలో యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అంతకుముందు తుంగపహాడ్ మోడల్ స్కూల్ లో విద్యార్ధులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోగవెల్లి వెంకటరమణ చౌదరీ, మిర్యాలగూడ రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ, ఎస్సైలు నరసింహ, రామమూర్తి యాదవ్, నాయకులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.