ప్రజాలహరిమిర్యాలగూడ
రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి వివిధ వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు
మిర్యాలగూడ వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ ,సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ , మిర్యాలగూడ డివిజన్ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యల పట్ల పోరాటాలు చేస్తూ విద్యార్థినిల రక్షణ పట్ల సహాయ శైలి కృషి చేస్తారన్నారు .ఈ రక్షాబంధన్ కార్యక్రమం ఒకరికి ఒకరు తోడు అనే విధంగా విద్యార్థినీలు యువకులు మహిళా మణులు చేసుకునే రాఖీ పండుగ అన్నారు ఏ ఒక్క ఆడపడుచులకు ఆపద వచ్చిన తెలంగాణ పోలీస్ శాఖ వారికి రక్షణగా ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అన్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శివకుమార్ సార్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వాదూద్ జగన్ ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ సూర్య ఉపేందర్ జావీద్ లోకేష్ ఆకాష్ సమద్ పవన్ కళ్యాణి మధుమతి సునీత అనిత బంగారి తదితరులు పాల్గొన్నారు