Ultimate magazine theme for WordPress.

రోహిత్ కఠినంగా ను శిక్షించాలి

Post top

*నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థిని పై దాడి చేసిన ప్రేమోన్మాది రోహిత్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది*

 

*నిర్భయ అభయ చట్టాలు అమలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే ఉరితీయాలని ఎస్ఎఫ్ఐ మిర్యాల డివిజన్ కమిటీ డిమాండ్*

 

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థిని పైన ప్రేమోన్మాది కత్తితో దాడి నిరసిస్తూ మిర్యాలగూడ స్థానిక చాకలి ఐలమ్మ విగ్రహం ముందు దిష్టిబొమ్మ దహనం

చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ మాట్లాడుతూ… నల్గొండ జిల్లాలో నవ్య అమ్మాయి పైన దాడిచేసిన ప్రేమోన్మాది నీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ దాడిలో గాయపడిన విద్యార్థినికి 10 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి.75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ అమ్మాయిల పైన దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకీ మహిళల దాడులు పెరగడం చాలా దురదృష్ట కరం అన్నారు, ఇది ప్రభుత్వాల విఫలమేనని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మహిళా చట్టాలు,షీ టీమ్స్, నిర్భయ చట్టాలు ఉన్నా కానీ దాడు జరగడం ప్రభుత్వాలు వాటిని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వలన జరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వాలు సిగ్గుపడాలనిన్నారు. నవ్య పైన దాడి చేసిన దుండగుడిని ప్రభుత్వం శిక్షించి నవ్యకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రభుత్వాలు ముందుగానే మహిళా చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్షులు వదూద్ ఎస్ఎఫ్ఐ నాయకులు సూర్య ఉపేందర్ తరుణ్ తులసియా మనీ సలీం మౌనిక రమ్య సంధ్య కవిత కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.