
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు.అనంతరం నల్లగొండ పురపాలక సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా గౌరవ మంత్రి వర్యులు మాట్లాడుతూ ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, యస్ పి రేమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, కంచర్ల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.