మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే భాస్కరరావు చొరవ చూపాలి:-అఖిల పక్షాల సూచన
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు చొరవ చూపాలని అఖిలపక్ష పార్టీలు సూచించాయి. మంగళవారం మిర్యాలగూడలోని ఎన్నెస్పీ అతిథిగృహంలో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాడి రాజు, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి,టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటులో మిర్యాలగూడకు అన్యాయం జరిగిందన్నారు. పార్టీలన్నీ ఐక్యమై జిల్లా సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. జిల్లా సాధన కోసం శాసన సభ్యులు భాస్కర్ రావు హుజూర్నగర్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే లను ఒప్పించాలని అఖిలపక్షం కోరింది. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని ప్రభుత్వం తక్షణం స్పందించి జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యమ తీవ్రతను గ్రామస్థాయిలో విస్తరించాలని కోరారు. విద్యార్థులు యువకులు మహిళలు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మల్లు గౌతంరెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధీరావత్ లింగ నాయక్ ఆఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుతుబుద్దీన్, ఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారుక్, న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్లు బి ఎం పీ జిల్లా కార్యదర్శి వజ్రగిరి అంజయ్య, సామాజిక కార్యకర్త రిషికేశ్ రాజు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు విద్యావంతుల వేదిక నాయకులు చీదెళ్ళ యాదయ్య ప్రజాసైన్స్ వేదిక నాయకులు సుదర్శన్ టిఆర్ఎస్ నాయకులు జాను నాయక్ సూర్య నాయక్ బి ఎం పీ నాయకులు నీలకంఠ నాయక్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.