ప్రజాలహరి.. అమిత్ షా పాదాల వద్ద ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డిని తరిమ్మి కొట్టాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు ఈరోజు చండూరు లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వలన ఎమ్మెల్యే అయినా రాజగోపాల్ రెడ్డి పార్టీ పై విశ్వాసం లేకుండా డబ్బు కోసం పదవిని తాకట్టు పెట్టిన మూర్ఖుడని విమర్శించారు .20 వేల కోట్ల కాంటాక్ట్ కోసం పార్టీ పరువు తీస్తూ ఎమ్మెల్యే పదవిని అమిత్ షా పాదాల వద్ద ఉంచారని ఇటువంటి వారిని ప్రజలు అసహ్యించుకోవాలన్నారు. పార్టీ కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి పనిచేస్తారని విమర్శించారు. మాజీ పిసిసి అధ్యక్షులు నలగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి లాంటి స్వార్థపరులు ప్రజల కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఇటువంటి వారిని రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు .మాజీ శాసనసభ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ దయా గుణము వలన తెలంగాణ ఏర్పడిందని అటువంటి తెలంగాణను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి వ్యక్తులు వాడుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలతో కొందరికి సంబంధం లేదని వారికి తమ వ్యాపార సామ్రాజ్యమే ముఖ్యమని ఇటువంటి ద్రోహుల్ని వదిలిపెట్టొద్దని అన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.