దసరా నాటికి ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని పూర్తి చేయాలి : మంత్రి గంగుల
ప్రజాలహరి..
కరీంనగర్ : దసరా కల్లా ఆర్ అండ్ బీ అతిథి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం ఆర్అండ్‌బీ అతిథి గృహ నిర్మాణ పనులను మేయర్ వయ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల పరిశీలించారు.ఈ సందర్భంగామంత్రిగంగులమాట్లాడుతూ.. పురాతన ఆర్ అండ్ బీ అతిథిగృహం శిథిలావస్థకు చేరుకున్నది.10 కోట్ల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ మధుసూదన రాజును ఆదేశించారు. పాత భవనాన్ని కూల్చివేసి..ఆ స్థలంలో అందమైన గార్డెనింగ్, పార్క్ నిర్మించాలని సూచించారు. మంత్రి వెంట మాజీ ఎంపీపీ వాసాల రమేష్ , గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.