నేడు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై గురువారం వేములపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు జిల్లా సాధన సమితి నాయకులు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్, పల్లా వెంకటయ్య, బంటు వెంకటేశ్వర్లు, చేగొండి మురళి యాదవ్, జయరాజు లు తెలిపారు. బుధవారం రాత్రి మిర్యాలగూడ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ శెట్టిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉదయం 8 గంటల నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణకు వేములపల్లి మండల జెడ్పిటిసి ఎంపీపీ ఎంపిటిసిలు సర్పంచ్లు సహకార సంఘం చైర్మన్ డైరెక్టర్లు మేధావులు విద్యార్థులు యువకులు మహిళలు నిరుద్యోగులు పెద్ద మొత్తంలో పాల్గొని అభిప్రాయాన్ని తెలియజేయాలని వారు కోరారు.