
ప్రజాలహరి.. తెలంగాణ రాష్ట్ర ఎస్.టి. కార్పొరేషన్ చైర్మన్ గా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఇస్లావత్ రామచంద్రనాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తీసుకున్నారు. ఆ మేరకు జీవోను విడుదల చేశారు. రెండు సంవత్సరాలు పాటు రామచంద్రనాయక్ పదవిలో కొనసాగుతారు. రామచంద్రనాయక్ గిరిజనులకు ,పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పదవిని ఇవ్వడం జరిగిందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండలం గిరిజన తండాకి చెందిన రామచంద్ర, నాయక్ సౌమ్యుడు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ప్రజాసేవలో పాల్గొనేవారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేశారు. పూర్తి చేశారు . ఆయన తదుపరి త్రిపురారం మండల రాజకీయాల్లో ప్రవేశం చేశారు. ముందుగా జడ్పిటిసి ఎంపీపీగా పదవులను అలంకరించారు .ఆ పదవులకు వన్నె. తీసుకొచ్చారు అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి తెలంగాణ లక్ష్యాలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఆయన ఆశయాలను గుర్తించిన కేసీఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిగా పదవిని ఇచ్చారు. తదుపరి ఆయన సేవలు పార్టీకి అవసరమని గుర్తించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.