
ప్రజాలహరి ..హైదరాబాదు బంజారా హిల్స్ పరిధిలో గురువారం పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ,హోం మంత్రి మహమూద్ అలీ ,డిజిపి మహేందర్ రెడ్డి,లు ప్రారంభించారు హైదరాబాద్ నగర కమిషనర్ సిపి ఆనందు తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి భవన ప్రారంభం సంబంధించిన శిలాఫలకాన్ని ఓపెనింగ్ చేశారు .ఈ భవనాన్ని సుమారు 600 కోట్ల రూపాయలతో ఐదు విభాగాలుగా నిర్మించారు. ఈ భవనం అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ద్వారా వ్యక్తుల కదలికను తక్షణ చర్యలు తీసుకున్న అవకాశం పెరుగుతుందని చెప్పారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన భవన్ భారతదేశం గర్వపడే విధంగా ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో ఈ భవనం ఉంటుందన్నారు