
కక్ష సాధింపుతో కౌన్సిలర్ వేదింపులు..
*దొంగ ఓట్లు తొలగించినదుకు కక్ష
*విచారించకుండానే కేసు నమోదు..
నిరసన తెలిపిన అంగన్వాడీ టీచర్లు..
దొంగ ఓట్లు తొలగించానని కక్ష కట్టి కౌన్సిలర్ జావిద్ మానసికంగా వేధిస్తున్నాడని బాధిత అంగన్వాడి టీచర్ జూలకంటి మల్లేశ్వరి ఆరోపించారు. 80 కేసు నమోదు అయినందుకు అంగన్వాడీ టీచర్లతో కలిసి గురువారం ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 31 వ వార్డు అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్నానని 29 వార్డుకు సంబంధించిన కొన్ని ఇండ్లు తమ సెంటరు పరిధిలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అంగన్వాడి సెంటర్ ఇరుకుగా ఉండడంతోపాటు పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో సెంటర్ మార్చేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కానీ కౌన్సిలర్ జావిద్ సెంటర్ మార్చకూడదని తనపై, పై అధికారులపై ఒత్తడి తీసుకొచ్చారని తెలిపారు అతనితో తనకు ప్రాణం ఉందని ఈ విషయం పై అధికారులకు వివరించానని, ఉదయం పూట సెంటర్ మార్చేస్తే అడ్డుకుంటాడని భావించి రాత్రి వేళలో సెంటర్ మార్చేందుకు ప్రయత్నించానన్నారు. ఆటో కూడా ఉదయం పూట ఖాళీగా లేకపోవడంతో రాత్రి వేళలో సెంటర్ ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. సమన్లు అంత మరో సెంటర్లో మార్చి తాళం వేసి బయటకి వెళ్ళేటప్పుడు కౌన్సిలర్ జవీద్ వచ్చి ఫుడ్ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు పోన్ చేసి చెప్పారని తెలిపారు. వెంటనే పోలీసులు వచ్చి అక్కడి స్థానికులను అడిగి వాస్తవాలు తెలుసుకున్నారని, ఆ సమయంలో వైస్ చైర్మన్ కుర్ర విష్ణు అక్కడే ఉన్నారని చెప్పారు. సెంటర్ మర్చినట్లు అక్కడి వారు చెప్పారని అట్టి రికార్డును దాచి పెట్టి నేను ఇచ్చిన పిటిషన్ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గి కేసు నమోదు చేశారని ఆరోపించారు. పై అధికారులు విచారించి నివేదిక తయారు చేసి పోలీసులకు ఇచ్చేందుకు వెళ్ళితే కనీసం తీసుకోకుండా రాత్రి 11 గంటల వరకు స్టేషన్ వద్ద అధికారులను ఉంచారని వాపోయారు. పైగా రిపోర్ట్ ఇవ్వలేదని పోలీసులు బుకాయిస్తున్నారని విమర్శించారు. కౌన్సిలర్ జవీద్ తో తనకు ప్రాణ హాని వున్నదని రక్షణ కల్పించాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలను నిజాయితీగా విచారించి కేసు ఉపసంహరించుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పార్వతి, నాగమణి, స్వరాజ్యం, యాదమ్మ, లలిత, కలమ్మ, సోమేశ్వరి, శేషు మని, చంద్రకళ, విజయ తదితరులు పాల్గొన్నారు.