ప్రజాలహరి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మిస్ చార్జీలు పెంచాలని నూతనంగా ఏర్పడ్డ గురుకులాలు కస్తూర్బాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత విద్య అందించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు రెండు జతల బట్టలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో పరిశీలించి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ జగన్ దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్ మండల కమిటీ సభ్యులు వినయ్ శివ అయ్యప్ప జావీద్ తరుణ్ ఉపేందర్ కళ్యాణి శివ కవిత పూర్ణ మేఘన సంధ్య దివ్య తదితరులు పాల్గొన్నారు