ప్రజల ఆకాంక్షను నెరవేర్చేకపోతే ప్రజాగ్రహం తప్పదు:-
ప్రజాలహరి…తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లాగా ఏర్పడాల్సిన అర్హతలు అవకాశాలు ఉన్నా మిర్యాలగూడను కావాలనే జాప్యం చేస్తూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలంగాణ టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్, బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాడి రాజు లు అన్నారు. మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ముఖ్య బాధ్యులు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోత్ దశరధ నాయక్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం పాలకపక్షాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. కొత్త రాష్ట్రంలో 12వ జిల్లాగా ఏర్పడాల్సిన మిర్యాలగూడ రాజకీయ పక్షపాతం, ప్రాంతీయ పక్షపాతంతో జిల్లాగా ఏర్పడకుండా అడ్డుకున్నారని అన్నారు. పార్టీలకతీతంగా సమరశీల పోరాటాల ద్వారా జిల్లాను సాధించుకోవాలని కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు గ్రామ స్థాయిలో ఉద్యమ తీవ్రత తీసుకోవడంతో పాటు పట్టణాల్లోని వార్డులలో జిల్లా ప్రాముఖ్యతను గురించి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సూచించారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు యువకులు ముందుండి బాధ్యత వహించాలని సూచించారు. జిల్లాగా ఏర్పడితే ప్రజలకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకతీతంగా జిల్లా ఏర్పాటు ఉద్యమంలో పాల్గొని జిల్లా ఏర్పాటును సాధించుకునేందుకు పాటుపడాలని కోరారు. మిర్యాలగూడ కంటే తక్కువ జనాభా విస్తీర్ణం వనరులు రోడ్డు రవాణా సౌకర్యం లేని వాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారని మిర్యాలగూడ పట్ల వివక్ష చూపడం తగదన్నారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు గాను జిల్లా సాధన కమిటీలను వేసుకుని ఉన్నట్టు తెలిపారు. త్వరలో మిర్యాలగూడ లో ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు, బంద్ కు పిలుపు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించి జిల్ల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మచ్చ ఏడుకొండలు యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రయ్య మురళి యాదవ్ బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు సామాజిక తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయరాజు ఆప్ పార్టీ జిల్లా నాయకులు కుతుబుద్దీన్ ఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి ఫారూఖ్ పిఎసిఎస్ డైరెక్టర్ పల్ల వెంకటయ్య, వీరయ్య విద్యుత్ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకయ్య యాదవ్, బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పరమేష్ వెంకటయ్య ఫార్వర్డ్బ్లాక్ జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి పరంగి రాము సామాజికవేత్త రిషికేశ్ రాజు, సిపిఐ ఎంఎల్ నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, పద్మ జటంగి నరసయ్య ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.