Ultimate magazine theme for WordPress.

తొలి మెట్టు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఈఓ

Post top
home side top

ప్రజాలహరి..తరగతి వారిగా విద్యార్థులందరూ విషయ సామర్ధ్యాలు కలిగి ఉండేలా బాధ్యతాయుతంగా బోధన చేయాలని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరచర్లలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు ఏర్పాటుచేసిన తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణార్థుల నుండి శిక్షణాంశాలకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. తరగతి గదిలో అభ్యసన ప్రక్రియలు అమలుపరిచే క్రమంలో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసి వెనుకబడిన విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే విధంగా విద్యా సంవత్సరం చివరి నాటికి విద్యార్థులు అందరూ పైతరగతుల సామర్థ్యాలు కలిగి ఉండే విధంగా నిరంతర పర్యవేక్షణతో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. ఆగస్టు 15 నుండి ఈ విద్యా సంవత్సరం పూర్తి అయ్యేవరకు తొలిమెట్టి కార్యక్రమం అమలు పరచాలని, ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించి ప్రతివారం స్లిప్ టెస్టులు గ్రాండ్ టెస్టుల ద్వారా గ్రేడింగ్ నమోదు చేయాలని మానిటరింగ్ అధికారులు వాటిని యాప్ లో పొందుపరిచి రికార్డు చేస్తారని, నిరంతర పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలవుతుందని అలసత్వం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ను చదివించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలాజీ నాయక్ కోర్సు డైరెక్టర్ మంగ్యా నాయక్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పిచ్చయ్య, రిసోర్స్ పర్సన్ లు సైదిరెడ్డి, భోజ్యా, షఫీ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.