కార్మికుల సంక్షేమం కోసం అంజయ్య విశేష కృషి
వర్ధంతి సభలో జూలకంటి
ప్రజాలహరి…
కార్మికుల సంక్షేమానికి నకరికంటి అంజయ్య విశేష కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నకరికంటి అంజయ్య ఏడవ వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు ముందుండి నడిపారని గుర్తు చేశారు. చివరి శ్వాస వరకు ఎర్రజెండా నాయకత్వంలో పనిచేశారని చెప్పారు. కార్మిక లోకానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో అసమానతలు పెరిగిపోయాయని వాటిని రూపుమాపేందుకు బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి రావాలంటే తమ సమాజ స్థాపన లక్ష్యమన్నారు. దాని సాధన కోసం క్షేత్ర స్థాయి నుండి ఉద్యమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్, తిరుపతి రామ్మూర్తి, డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, గాదె పద్మ, వరలక్మి, పాదురి గోవర్ధన, పరుశురాములు, దేశిరం నాయక్, కృపాకర్ రెడ్డి,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.