తడకమళ్ళ గ్రామానికి బస్సు నడపాలి..
ప్రజాలహరి.
తడకమళ్ళ గ్రామానికి ఆర్టీసీ బస్సులు రాక దరిదాపు రెండు సంవత్సరాలైంది, తడకమళ్ళ లో మిర్యాలగూడ సూర్యాపేట నల్గొండ డిపోలకు సంబంధించిన మూడు బస్సులు రాత్రి గ్రామంలోనే ఉండేవి ఉదయం గ్రామం నుండి 6 గంటలకు బస్సులు బయలుదేరేవి. కానీ గత రెండు సంవత్సరాల నుండి మూడు డిపోలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు అసలు గ్రామానికి రావడం బంద్ చేశారు, మిర్యాలగూడ డిపో నుండి తడకమళ్ళ గ్రామానికి రావడానికి యాదిగిరిపల్లి, ఉట్లపల్లి, తక్కెళ్ళపాడు, దుబ్బ తండ నుండి తడకమళ్ళకు, సూర్యాపేట నుండి తడకమళ్ళకు, నల్గొండ నుండి తడకమళ్ళ నుండి హైదరాబాద్, బస్సులు ఉండేవి, ఇప్పుడు తడకమళ్ళ గ్రామానికి వెళ్లాలన్న తడకమళ్ళ మరియు కామేపల్లిగూడెం నుండి చదువుల కొరకు నిత్యవసర సరుకులకు టౌన్ కు వెళ్లాలన్న విద్యార్థులు ,మహిళా ,విద్యార్థులు ముసలి వాళ్లు వ్యవసాయదారులు కూలీలు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు బస్సులు లేక ఆటోల మీద వెళ్లాలన్నా సరైన టైమ్ బస్సు బస్సు లేకపోవటం వలన ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు, గత్యంతరం లేక ఆటోలకు వందల రూపాయలు కట్టి ఆటోల మీద వెళ్ళవలసి వస్తుంది. సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఆర్టీసీ డిపో వారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం, ఆర్టీసీ డిపో వారు మిర్యాలగూడ నుండి తడకమళ్ళ నుండి సూర్యాపేటకు, సూర్యాపేట నుండి తడకమళ్ళ మిర్యాలగూడ కు, నల్గొండ నుండి తడకమళ్ళ మిర్యాలగూడ కు మిర్యాలగూడ తడకమళ్ళ నుండి నల్గొండకు ఈ విధంగా బస్సులు నడుపుతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఆర్టీసీ వారికి కూడా లాభదాయకంగా ఉంటుందని ప్రజలు తెలియజేయుచున్నారు, వెంటనే స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు తడకమళ్ళ గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావటానికి వెంటనే చర్య తీసుకోవాలని, అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్లు అధికారులు చొరవ తీసుకొని తడకమళ్ళ ప్రజలలకు ఇబ్బంది కలగకుండా బస్సులు నడిపించాలని తడకమళ్ళ ప్రజలు కోరుతున్నాము. మాజీ సర్పంచ్ మారం భిక్షమయ్య, అనంతుల పెద్ద నరసయ్య, మారం వెంకటరమణ, నాగులపాడు ఉపసర్పంచ్ రావిరాల తారకమ్మ, ఉప్పల శారద, బుచాలా వెంకటకృష్ణ, మారం ప్రవీణ్, బుడబుక్కల అధ్యక్షులు ఆవుల మహేష్, మారం కృష్ణయ్య, అనంతుల యాదగిరి, నరసింహస్వామి, నారా బోయిన గామితి, పొన్నబోయిన అచ్యుత్, తదితరులు పాల్గొన్నారు.