సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం.. ‘మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్’
ప్రజాలహరి:
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం అవసరం అని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ సూచించారు.పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు “ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు” కార్యక్రమంలో భాగంగా ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి తన ఇంటిలో ఉన్న పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో నీరు పేరుకుపోయిందా అని పరిశీలించారు. పూల కుండిల నుంచి పేరుకుపోయిన నీటిని తొలగించారు. అనంతరం భార్గవ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాకాలం దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 45 వ వార్డు కౌన్సిలర్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.