Ultimate magazine theme for WordPress.

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 60 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ

Post top

ప్రజాలహరి…136 మంది బాధితులకు రూ.54లక్షల 95 వేలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ : భాస్కర్ రావు

 

ప్రజాలహరి..ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని అభివర్ణించారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి, దామరచర్ల మండలాలకు చెందిన మొత్తం 136 మంది బాధితులకు మంజూరైన 54 లక్షల 95వేల రూపాయలు విలువైన చెక్కులను మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో భాస్కర్ రావు శనివారం అందజేశారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపద్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేస్తోందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి,ఎంపీపీ నూకల సరళ హన్మంతరెడ్డి, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీర కోటిరెడ్డి, హాతీరామ్ నాయక్, ధీరావత్ రవితేజ, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్,యూసుఫ్, పడిగపాటి కోటిరెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శి దారగని వెంకటేశ్వర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

 

#మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమ వివరాలు సంక్షిప్తంగా….

నేడు పంపిణీ చేసిన మొత్తం చెక్కులు… 136

వీటి విలువ : రూ.54,95,000/- మిర్యాలగూడ మండలంలో 49 మంది లబ్ధిదారులకు రూ.16,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు  దామరచర్ల మండలంలో 41 మంది లబ్ధిదారులకు రూ.19,33,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు  వేములపల్లి మండలంలో 34 మంది లబ్ధిదారులకు రూ.13,28,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మడుగులపల్లి మండలంలో 12 మంది లబ్ధిదారులకు రూ.16,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు

post bottom

Leave A Reply

Your email address will not be published.