మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి శుక్రవారం మిర్యాలగూడలోని విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలో పరిధిలో బోర్ల కింద మోటార్ల కింద కాల్వ చివరి భూముల ప్రాంతాల్లో వరిననాట్లు కు నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతుందన్నారు ఇందుకు విద్యుత్ సరఫరా కారణమని ఆయన చెప్పారు నాగార్జున సార్ ఎడమ కాలువకు నీటి విడుదల చేశారని ఈ సందర్భంలో నిరంతర విద్యుత్తు లేకపోవడంతో రైతాంగం ఇబ్బంది పడతారని అధికారులు సమస్యను దృష్టిలో ఉంచుకొని నిరంతరాయంగా విద్యుత్ అందించాలన్నారు లేని పక్షంలో విద్యుత్ కార్యాలయం ఎదుట అమర్ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వేములపల్లి కిసాన్ అధ్యక్షుడు తంగేళ్ల సత్తిరెడ్డి పూసలపాడు సర్పంచ్ సత్యనారాయణ వేములపల్లి మాజీ సర్పంచ్ మధు రాష్ట్ర నాయకులు పుట్టల గురవయ్య వెంకటేష్ గౌడ్ లింగయ్య పగడాల వెంకన్న ప్రవీణ్ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.