Ultimate magazine theme for WordPress.

నిరవధిక సమ్మెకు సంఘీభావం – దైద రవీందర్

Post top

నిరవధిక సమ్మెకు సంఘీభావం – దైద రవీందర్ :

ప్రజాలహరి:

కేతేపల్లి మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం – ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు నక్రేకల్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ బాధ్యుడు దైద రవీందర్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విఆర్ఎ ల పట్ల చిన్నచూపు చూపిస్తున్నదన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా ఎమ్మార్వో ఆఫీసుల ముందు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పే – స్కేల్ జీవో విడుదల చేసి విఆర్ఎ ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ , జెడ్పీటిసి బొప్పని నాగేశ్వరరావు , మహిళా నాయకురాలు మంగమ్మ , జట్టంగి ముత్తయ్య , వెంకన్న , యం.డి యూసుఫ్ , పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.