ప్రజాలహరి.. మిర్యాలగూడ పట్టణంలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే ట్యాంకుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మిర్యాలగూడకు దాహార్తిని తీర్చేందుకు మిర్యాలగూడ గ్రామపంచాయతీ స్థాయిలోనే పెద్దదేవులపల్లి నుంచి నందిపాడు వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తద్వారా నీటిని విడుదల చేశారు. తర్వాత 1995, 2016లో 20 కోట్ల రూపాయలతో మిర్యాలగూడ పట్టణంలో 4 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించారు .వాటి ద్వారా నీటిని పంపిణీ చేసేవారు .అనంతరం 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథ కింద ఒక్కొక్కటి సుమారు 7 లక్షల గాలెన్ల నిలువ చేసే సామర్థ్యం గల ఎనిమిది ట్యాంకులను పట్టణంలో నిర్మించారు. వీటి ద్వారా పరిశుభ్రమైన మంచినీటినీ ఇంటింటికి ద్వారా విడుదల చేస్తారు. సమస్య అంతా ట్యాంకుల నిర్వహణ తో ఏర్పడు తున్నది. అవంతిపురం దగ్గర గల భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుంచి నీటి విడుదల టౌన్ లో గల ఓహెడ్ ట్యాంకులకు సమయానుసారంగా పంపింగ్ జరగట్లేదు. అందువల్ల ఆ ట్యాంకుల నుంచి వార్డుల వారీగా నీటి విడుదల చేయటం ఓ యజ్ఞం లా మారింది. స్థానికంగా అధికారము, పెత్తనం గల వారి వార్డులకు సమయపాలన పాటించుకుంటూ మిగతా వార్డుల్లో ట్యాంకులకు నీటి విడుదల జరుగుతుంది. ఇందువల్ల ప్రజలు రాత్రి 8 గంటలకు 9 గంటలకు 10 గంటల సమయంలో నీటిని తమ వార్డుల ద్వారా వచ్చే ఇంటింటికి భగీరథ పథకం కింద నీటిని స్టోర్ చేసుకున్న పరిస్థితి ఉంటుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం మరియు భగీరథ అధికార యంత్రానికి సమన్వయ లోపం వలన ఇటువంటి సమస్యను ఉప్పన్నమవుతున్నాయి. వీరు ఇరువురు మధ్యన సమన్వయం లేకపోవడమే సమస్యను పెద్దగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వార్డులలో అయితే రెండు రోజులకొకసారి విడుదలవుతున్నాయి .వీరితో పాటు మున్సిపల్ పాలకవర్గము నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి నీటి విడుదలలో జరుగుతున్న లోపాలు సరిదద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు కోరుతున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.