ప్రజాలహరి.. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచిఎడమ కాలువ నీటిని విడుదలచేసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఉదయం స్థానిక శాసనసభ్యులు భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ,జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రనాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పూజలు నిర్వహించి ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు .కృష్ణమ్మకు పూలు ,పసుపు కుంకుమ, వస్త్రాలు సమర్పించారు. నీటి విడుదలతో ఎడమకాల పరిధిలో నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ సాగు నీటి వాడకం ఉపయోగపడుతుంది. సుమారు 6 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి సాగులోకి రానున్నదిప్రాజెక్టు రైతుల పాలిట జీవనాధార,వరప్రదాయనిగా పేరుగాంచిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.