Ultimate magazine theme for WordPress.

పరిశీలించిన కమిషనర్ అజయ్ కుమార్

Post top

ప్రజాలహారి…మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఓపి విభాగంలోని అన్ని వార్డులు డయాలసిస్ వార్డ్ చిన్నపిల్లల వార్డు మహిళల ప్రత్యేక వార్డు గైనకాలజీ వార్డు రక్తం లను సందర్శించి పరిశీలించారు రోగులతో విడివిడిగా మాట్లాడుతూ వారికి అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో 200 పడకలకు సామర్థ్యం పెంచేందుకు కాను అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయనే విషయమై పరిశీలించేందుకు వచ్చామన్నారు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రత్యేకంగా డ్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకు వచ్చినందున దాని విషయమే సైతం పరిశీలిస్తున్నామన్నారు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు ప్రాంతీయ ఆసుపత్రికి రెండవ అంతస్తు ఏర్పాటుకు గాను 13 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు డయాలసిస్ రోగుల కోసం నెఫ్రాలజిస్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ఆయన వెంట డి సి హెచ్ ఎస్ మాతృనాయక్ ప్రోగ్రాం ఆఫీసర్ రమేష్ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస సమరత్ ఆర్ ఎం ఓ రాంబాబు తదితరులు ఉన్నారు అనంతరం వైద్యులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు

post bottom

Leave A Reply

Your email address will not be published.