విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ. బి ఎల్ ఆర్ .,. వేములపల్లి మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల నందు ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు సుమారు 80 మంది పిల్లలకు బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఏర్పాటుచేసిన నోట్ పుస్తకాలను బుధవారం ఎంపీపీ పుట్టల సునీత కృపయ్యతో కలిసి వారు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతానని ప్రకటనలే తప్ప ప్రభుత్వ పాఠశాలలకు చేసింది ఏమి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉచిత హామీలను మరిచి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేనట్లయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజల తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తంగెళ్ల సత్తిరెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హజీ, గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టల పెద్ద వెంకన్న, స్కూల్ చైర్మన్ వెంకన్న,మాజీ సర్పంచ్ నాగవల్లి మధు, మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుట్టల శ్రీను (కల్లు)దైదగిరి,నాగవల్లి కృష్ణ, పషి, బొంగర్ల వినోద్, పగడాల వెంకన్న, ముజామీర్, నవీద్, దైద అశోక్, పుట్టల వినయ్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.