Ultimate magazine theme for WordPress.

ఏబిసిడి వర్గీకరణ చేయాలి

Post top

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి:-

ప్రజాలహరి..ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ ABCD బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని MRPS జిల్లా అధ్యక్షులు మచ్చ ఏడుకొండలు మాదిగ, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్,నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మడుపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు బుధవారం మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తోందన్నారు. రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సండ్రాల నాగరాజు ఎం ఎస్ పి నాయకులు మాతంగి నాగేంద్ర బాబు దైద నాగరాజు మోహన్ గోవర్ధన్ హరీష్ ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.