ప్రజాలహరి… ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు తక్షణం పే స్కేలు అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరవధిక దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు,ఈసందర్భంగా VRA జేఏసీ చైర్మన్ సైదులు, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోత్ దశరధ నాయక్ మాట్లాడుతూ వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
కనీస వేతనాన్ని నోచుకోకపోవడంతో సంవత్సరాల తరబడి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అర్హత కలిగిన విఆర్ఎల అందరికీ పదోన్నతులు కల్పించాలని, విధి నిర్వహణలో మృతిచెందిన వీఆర్ఏ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర ఉద్యోగుల వలనే వీఆర్ఏల ను బదిలీ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విఆర్ఏ లో సతీష్, చంద్రయ్య నాగరాజు శ్రీనివాస్ సైదులు సలీమా, బంజారా సంఘం నాయకులు లావుడియా లింగ నాయక్ సంఘీభావం తెలిపారు తదితరులు పాల్గొన్నారు