ప్రజాలహరి.. ఢిల్లీ రాజకీయాలు తెలంగాణ ను నడిపిస్తున్నాయా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ తెలంగాణ ప్రభుత్వము ను ఇరుకున పడేసే విధంగా జర్నలిస్టులతో మాట్లాడారు. ప్రగతి భవన్-రాజ్ భవన్ కు దూరం తగ్గలేదని పరోక్షంగా వారు చెప్పారు. వరదల్లో భాగంగా భద్రాచలం వెళ్లిన తనకు ప్రోటోకాల్ పాటించలేదని కలెక్టర్ హాజరు కాలేదని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తుందని వారు చెప్పారు వాటికి అనేక కారణాలు ఉన్నాయని వివరించారు.